Header Banner

మీకు ఈ విషయం తెలుసా? వీలునామా vs ట్రస్ట్‌ - మన ఆస్తులు కాపాడుకోవడానికి ఏది బెస్ట్‌ ఆప్షన్‌?

  Thu Feb 13, 2025 09:00        Politics

అందరూ కుటుంబం కోసం కష్టపడతారు, సంపాదిస్తారు. తమ తదనంతరం వారసులు అందరికీ న్యాయం చేసేలా ఆస్తులు పంచాలని అనుకుంటారు. కానీ ఎలా చేయాలి? ఏం చేయాలి? అనే దానిపై చాలామందికి క్లారిటీ ఉండదు. ఇదే సమస్య ఓ వస్త్ర వ్యాపారికి ఎదురైంది. తాను మృతి చెందాక భార్య, తల్లిదండ్రులు, కుమార్తెకు ఆర్థిక భరోసా ఇచ్చే విధంగా తన ఎస్టేట్‌ను ప్లాన్‌ చేయాలని అనుకుంటున్నారు. అంతకుముందు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలేంటని ప్రశ్నించారు. ఎస్టేట్ ప్లానింగ్ అంటే మరణం తర్వాత ఆస్తులను మేనేజ్ చేయడం, పంపిణీ చేసే ప్రాసెస్. ఇందులో ట్యాక్స్ ప్లానింగ్, ఖర్చులను తగ్గించడం కూడా భాగంగా ఉంటాయి. ఎస్టేట్‌ను ప్లాన్ చేయడం వల్ల మీ ఆస్తులకు రక్షణ లభిస్తుంది, కుటుంబ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.

సమగ్రంగా ఎస్టేట్ ప్లాన్ చేయడం ఎలా అనే అంశాలపై ది విక్టోరియం లీగలిస్ అసోసియేట్ మోక్సీ షా, మేనేజింగ్ పార్టనర్ ఆదిత్య చోప్రా ‘లైవ్‌మింట్‌’ ద్వారా చేసిన సూచనలు తెలుసుకుందాం. వీలునామా అనేది మరణం తర్వాత ఆస్తులు ఎలా పంపిణీ చేయాలో వివరించే లీగల్ డాక్యుమెంట్. ఇందులో ఆస్తి, డబ్బు ఎవరికి వారసత్వంగా లభిస్తుందో తెలియజేయాలి. ఎస్టేట్‌ను మేనేజ్‌ చేయడానికి ఒక ఎగ్జిక్యూటర్‌ను నియమించాలి. మైనర్ పిల్లలు లేదా ఆధారపడిన వారి కోసం తగిన ఏర్పాట్లు చేయాలి. వీలునామా రాసిన వ్యక్తి కోరిక ప్రకారం ఆస్తుల పంపిణీ జరుగుతుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య వివాదాలను తగ్గిస్తుంది. ఫ్యామిలీ ట్రస్ట్ అనేది లబ్ధిదారుల కోసం ఆస్తులను కలిగి ఉండే, మేనేజ్‌ చేసే చట్టపరమైన సంస్థ. ట్రస్ట్‌ ఏర్పాటు చేసే అనేక ప్రయోజనాలు ఉంటాయి.

 

ఇది కూడా చదవండి: మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?

 

ఆస్తి రక్షణ: సంపద దుర్వినియోగం కాకుండా, చట్టపరమైన వివాదాల నుంచి ఆస్తులను కాపాడుతుంది.

పన్ను ప్రయోజనాలు: ట్యాక్స్‌ ప్లానింగ్‌, ఇతర ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి.

సంపద పంపిణీ: షరతుల ప్రకారం నిధులు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకుంటుంది.

రిఓకబుల్‌ ట్రస్ట్ (మార్చవచ్చు) లేదా ఇర్రిఓకబుల్‌ ట్రస్ట్ (మార్చలేనిది) ఏర్పాటు చేయవచ్చు. ట్రస్ట్‌లు కుటుంబానికి దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను అందిస్తాయి.

పవర్ ఆఫ్ అటార్నీ

ఒకరు ఆర్థిక, చట్టపరమైన విషయాలను మేనేజ్‌ చేయలేనప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ (POA)ని నియమించుకోవచ్చు. నమ్మకమైన వ్యక్తిని సక్రమంగా పనులు నిర్వహించేందుకు ఎంచుకోవచ్చు. పవర్‌ ఆఫ్‌ అటార్నీకి సాధారణంగా అన్ని ఫైనాన్షియల్, లీగల్ నిర్ణయాల అధికారం ఇస్తారు. లేదంటే పరిమితంగా నిర్దిష్ట పనులకు నిర్దిష్ట అధికారాలను మంజూరు చేయవచ్చు.

బిజినెస్‌కి వారసులు

ఏవైనా వ్యాపారాలు ఉన్నప్పుడు, యజమాని మరణించాక, బిజినెస్‌ ఎవరికి అప్పగించాలనేది ముందుగానే ప్లాన్‌ చేయాలి. వ్యాపారాన్ని ఎవరు స్వాధీనం చేసుకోవాలో నిర్ణయించాలి. ఈ ప్రాసెస్ సరిగా జరిగేందుకు లీగల్‌ అగ్రిమెంట్స్ రెడీ చేయాలి. వారసత్వ ప్రణాళిక (Succession planning) సక్రమంగా చేస్తే బిజినెస్‌ లెగసీ కొనసాగుతుంది, కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. వీలునామా లేదా ట్రస్ట్ రెండూ దేనికదే ప్రత్యేకం. చిన్న ఎస్టేట్స్‌కు వీలునామా సింపుల్‌గా సరిపోతుంది, తక్కువ ఖర్చు అవుతుంది. ట్రస్ట్ అయితే మరింత నియంత్రణ, పన్ను ప్రయోజనాలు, ఆస్తి రక్షణ లభిస్తాయి. ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ట్రస్ట్‌లో చేర్చని ఆస్తులు కూడా సక్రమంగా పంపిణీ అవుతాయి. వీలునామా, ట్రస్ట్ రెండింటి కలయిక ఆస్తుల బదిలీని మరింత సులభతరం చేస్తుంది, చట్టపరమైన సమస్యలను తగ్గిస్తుంది, ప్రైవసీని కాపాడుతుంది.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?

 

వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..

 

ఈసారి Valentines Dayకి మీ గర్ల్ ఫ్రెండ్ ని విమానం లో తీసుకువెళ్లండి.. భారీగా డిస్కౌంట్ ఇస్తున్న ఇండిగో! త్వరగా బుకింగ్ చేసుకోండి!

 

ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..

 

మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో బెదిరింపు ఫోన్ కాల్‌ క‌ల‌క‌లం! ఫ్లైట్‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌దాడి?

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. జిల్లాల్లో పెరుగుతున్న బర్డ్ ఫ్లూ వైరస్.. రేటు తగ్గినా, గుడ్లు ఫ్రీ అన్న తినకండి!

 

మెగా డీఎస్సీపై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌! ఎలాంటి న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు లేకుండా..

 

వైకాపా హయాంలో మద్యం అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తి! త్వరలో నిజాలు బహిరంగం.. కొల్లు రవీంద్ర!

 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం గుడ్​న్యూస్.. ఢిల్లీలో కుమారస్వామితో పురందేశ్వరి భేటీ!

 

హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ.. మళ్లీ తాను డ్యాన్స్.. ఆందోళనలో అభిమానులు..

 

ఆయన రాజేసిన చిచ్చును ఆర్పుతున్న చంద్రబాబు! ఆ చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదు!

 

ఆ బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. చంద్రబాబు కీలక హామీ!

 

ఏపీలో రెండు చోట్ల వైరస్‌ నిర్ధారణ! రెడ్ జోన్ ఏర్పాటు - పీపీఈ కిట్లతో కోళ్ల తనిఖీలు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Business #News #EstatePlanning